దర్శి మండలం చందలూరు పిహెచ్సి డా. శ్రీనివాసులు 0-5 వయసున్న చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఈనెల 28న మండల వ్యాప్తంగా 52 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామని, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకు తప్పనిసరిగా రెండు చుక్కలు పోలియో డ్రాప్స్ వేయించాలని శనివారం తెలిపారు. ఇవి నిండు జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని ఆయన పేర్కొన్నారు.