మున్సిపల్ కమిషనర్ ఇంట్లో భారీగా పట్టుబడ్డ నగదు, బంగారం

540చూసినవారు
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై వినుకొండ మున్సిపాలిటీ రెవెన్యూ అధికారి, దర్శి మున్సిపాలిటీ ఇన్‌చార్జ్ కమిషనర్ యాదాల మహేశ్వరరావుపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దర్శి, నరసరావుపేట, సత్తెనపల్లిల్లో ఏకకాలంలో జరిగిన ఈ సోదాల్లో, మహేశ్వరరావు తన కుటుంబ సభ్యుల పేరిట 9 ఇంటి స్థలాలు, 2 ఫ్లాట్లు, వ్యవసాయ భూమిని కూడబెట్టినట్లు గుర్తించారు. వీటితో పాటు 729 గ్రాముల బంగారం, లక్షల కొద్దీ నగదు, 9.2 కేజీల వెండి, భారీగా గృహోపకరణాలు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్