తాళ్లూరు-1వ సచివాలయంలో పనిచేసిన మహిళా ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురిచేసిన కేసులో డిప్యూటీ ఎంపీడీవో దారా హనుమంతరావు, పూర్వపు పంచాయతీ కార్యదర్శి ఐవీ రమణారెడ్డిలపై అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. గతంలో మహిళా ఉద్యోగి కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా, ఒంగోలు ఆర్డీవో నేతృత్వంలోని కమిటీ విచారణ జరిపి నివేదికను నవంబర్ 21, గత ఏడాది నాడు కలెక్టర్‌కు అందజేసింది. కలెక్టర్ ఆదేశాల మేరకు పూర్వపు సెక్రటరీ ఐవీ రమణారెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, డిప్యూటీ ఎంపీడీవో హనుమంతరావుపై క్రమశిక్షణా చర్యల కోసం రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్‌కు లేఖ రాశారు. ఆర్థికపరమైన తప్పులకుగాను మహిళా ఉద్యోగికి షోకాజ్ నోటీసులు అందజేశారు.