దర్శి ఎమ్మెల్యే,
వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ముఖ్యమంత్రి
జగన్ మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రెసిడెంట్‌గా ఆయనను నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కమిటీలో తాడిపత్రి చంద్రశేఖర్, అన్నా రాంబాబు, నాగార్జున రెడ్డిలకు కూడా చోటు కల్పించారు. ఈ నియామకం రాయలసీమ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు.