మల్లాడి కృష్ణారావు చేసింది ఏమి లేదు: కైపు

1116చూసినవారు
యానాంలో జరగనున్న ఎన్నికలపై దర్శి కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ వెంకటకృష్ణారెడ్డి బుధవారం సోషల్ మీడియా వేదికగా మాట్లాడారు. యానాం నియోజకవర్గానికి మల్లాడి కృష్ణారావు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. మల్లాడి ఒక కార్పోరేట్ శక్తి అని, గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ సామాన్య ప్రజల వ్యక్తి అని పేర్కొన్నారు. యానాం ప్రజలు 9వ తేదీన సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈసారి కాంగ్రెస్ తన పట్టును నిలుపుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్