పీఎం శ్రీ పాఠశాల కిచెన్ గార్డెన్ ను మెరుగుపరిచిన అధికారులు

343చూసినవారు
పీఎం శ్రీ పాఠశాల కిచెన్ గార్డెన్ ను మెరుగుపరిచిన అధికారులు
తాళ్లూరు మండలం, తూర్పు గంగవరం లోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కిచెన్ గార్డెన్ ను అభివృద్ధి చేస్తున్నారు. వివిధ రకాల కూరగాయలు వేసి గార్డెన్ ను తీర్చిదిద్దుతున్నారు. ఈ గార్డెన్ ను డిప్యూటీ డిఇఓ చంద్రమౌళి పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. వాటర్ పైప్ లైన్ సిస్టమ్స్, సాగు విధానంపై ప్రధానోపాధ్యాయులు వైయస్సార్ కే ప్రసాద్, వొకేషనల్ ట్రైనర్లు అంజిబాబు, దావీదులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు యాకోబు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్