మహిళ మృతదేహానికి పోస్టుమార్టం

542చూసినవారు
మహిళ మృతదేహానికి పోస్టుమార్టం
తన చెల్లిని హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ, న్యాయం చేయాలని కోరుతూ పాలపర్తి కరుణమ్మ (33) సోదరుడు కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. గత ఏడాది నవంబర్ 21న మృతి చెందిన కరుణమ్మ అనారోగ్యంతో కాకుండా, ఆమెతో సహజీవనం చేస్తున్న నాగంబొట్లపాలెం మాజీ ఎంపీటీసీ ఎబేల్ రాజు హత్య చేసి ఉంటాడని కోటేశ్వరరావు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని చూపించకుండా ఖననం చేశారని, స్థానిక పోలీసులు పట్టించుకోలేదని ఎస్పీ హర్షవర్ధన్రాజుకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం దోసకాయలపాడులో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, దర్శి డీఎస్పీ విచారణకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్