దొనకొండ పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్సైగా ఎల్. రామకృష్ణ ఈ రోజు బాధ్యతలు చేపట్టారు. ఆయన ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ నుండి బదిలీపై వచ్చారు. ఇంతకాలం దొనకొండ ఎస్సైగా పనిచేసిన టీ. త్యాగరాజు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. నూతన ఎస్సైకి పోలీస్ సిబ్బంది, స్థానికులు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించేందుకు, చట్టం, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్సై రామకృష్ణ తెలిపారు.