ప్రకాశం జిల్లా
వైసీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ప్రకటనలో, శ్రీశైలంలో నిర్మించిన కాటేజీని దేవస్థానం వారికి అప్పగించారని తెలిపారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని ప్రజల దృష్టి మళ్లించేందుకు దేవుళ్లను అడ్డుపెట్టుకుంటున్నారని ఆరోపించారు. దేవుడి సొమ్ము తినే అవసరం తమకు లేదని ఆయన అన్నారు.