భారీ కొండ చిలువ హల్చల్

655చూసినవారు
కురిచేడు మండలం పొట్లపాడు గ్రామంలో అర్ధరాత్రి సమయంలో 12 అడుగుల భారీ కొండచిలువ సంచలనం సృష్టించింది. గ్రామస్థుల సమాచారం మేరకు బీట్ ఆఫీసర్ ధనలక్ష్మి, స్నేక్ క్యాచర్ రామకృష్ణ చాకచక్యంగా వ్యవహరించి కొండచిలువను పట్టుకుని సంచిలో బంధించారు. ఈ క్రమంలో దాదాపు 20 కొండచిలువ గుడ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అధికారులు కొండచిలువను అడవిలో వదిలివేసి, దాని గుడ్లను మార్కాపురం ఫారెస్ట్ కార్యాలయంలో సురక్షితంగా ఉంచినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్