ప్రకాశం జిల్లా దర్శి సీఐ వై. రామారావు తెలిపిన వివరాల ప్రకారం, దర్శి పోలీసుస్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ కు సంబంధించి షేక్ నాగుల్మీరా, షేక్ సిద్ధయ్య అనే ఇద్దరిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరచగా, కోర్టు నిందితులకు రిమాండ్ విధించింది. క్రికెట్ బెట్టింగ్ ను ప్రోత్సహించినా లేదా నిర్వహించినా చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.