దర్శిలో అడవి పంది దాడి.. వ్యక్తి మృతి

380చూసినవారు
దర్శిలో అడవి పంది దాడి.. వ్యక్తి మృతి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం పరిధిలోని కురిచేడు మండలం బోధనంపాడు గ్రామ సమీపంలో అడవి పంది దాడిలో రత్నం ఏడుకొండలు (41) అనే రైతు ఆదివారం మృతి చెందారు. అగ్రహారం గ్రామానికి చెందిన ఆయన కంది కోయడానికి పొలానికి వెళ్లగా, అడవి పంది దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్