
అమావాస్యకు మోక్షం కలిగించే దస్తగిరి స్వామి
మార్కాపురం జిల్లాలోని నరవ బైనపల్లి గ్రామంలో కొలువైన దస్తగిరి స్వామిని ప్రతి అమావాస్య రోజున దర్శించుకుంటే ఎన్నో సమస్యలకు మోక్షం లభిస్తుందని గ్రామస్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. స్వామి వద్ద ఉండే ఆస్థానమాలిక్ భక్తుల ఇబ్బందులను విని పరిష్కారం చూపుతారని, చీడపీడలు తొలగి సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. నిద్రలో ఉలిక్కిపడే చిన్నారులకు అంతరం వేయడం వల్ల ప్రశాంతంగా నిద్రపోతారని భక్తులు చెబుతున్నారు. ప్రతి ఆది, శుక్రవారం, అమావాస్యతో పాటు మంగళవారం కూడా దస్తగిరి స్వామి వద్దకు భక్తులు భారీగా తరలివచ్చి అన్నదానం చేశారు.




































