మంటలలో దగ్ధమైన కారు

531చూసినవారు
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఆదివారం విశ్వ భారతి స్కూల్ సమీపంలో ఓ ఇండిగో కారు దగ్ధమైంది. గుర్తు తెలియని వ్యక్తులు కారు సమీపంలో చెత్తను తగలబెట్టడంతో మంటలు వ్యాపించి కారు కాలిపోయింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో కారు యజమాని సయ్యద్ సైఫుల్లాకు రూ. 2,50,000 నష్టం వాటిల్లింది.

సంబంధిత పోస్ట్