గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లిలో సీఎం సభ ముగిసిన తర్వాత, బేస్తవారిపేట మండలం పూసలపాడుకు చెందిన
టీడీపీ కార్యకర్త శ్రీరామ్ బస్సు ఎక్కుతూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. మూర్ఛ వచ్చిందని భావించిన స్థానికులు అతనికి చికిత్స అందించారు. అనంతరం గిద్దలూరు ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు.