గిద్దలూరు పట్టణానికి చెందిన వేములపాటి వెంకట్ సురేష్, మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుండి వచ్చి, తల్లిదండ్రుల కష్టం, ఉపాధ్యాయుల సూచనలతో గ్రూప్ 2 పరీక్షలో డిప్యూటీ తహసీల్దార్‌గా అర్హత సాధించారు. తన స్వశక్తితో సాధించిన ఈ విజయం ద్వారా తల్లిదండ్రుల కృషికి, ఉపాధ్యాయుల సలహాలకు గొప్ప గుర్తింపు తెచ్చినట్లు ఆయన తెలిపారు. కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని ఆయన నిరూపించారు.