బేస్తవారిపేట గాంధీనగర్‌లో చిన్న మామను హత్య చేసి, పిల్లనిచ్చిన మామను హత్యాయత్నానికి గురిచేసిన నిందితుడు పొద్దుటూరి పీరవలిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. రెండు నెలల క్రితం తన కూతురిని ఇబ్బంది పెడుతున్నాడని మామ రాజా హుస్సేన్, అతని తమ్ముడు ఖాజావలి నిందితుడిని మందలించడంతో కోపం పెంచుకున్న పీరవలి, యూట్యూబ్ వీడియోలు చూసి చిన్న మామ ఖాజావలిని హత్య చేసి, మామ రాజా హుస్సేన్‌పై దాడి చేశాడు.