గిద్దలూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైసీపీ ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయలేదని తమను ప్రశ్నించడం సరికాదని, 15 ఏళ్లుగా వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నా ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు.