పరిసరాల పరిశుభ్రత పై విద్యార్థులకు అవగాహన

1415చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరు పురపాలక సంఘం పరిధిలో శనివారం “స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం”ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి, పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చెత్తాచెదారం రోడ్లపై వేయకుండా, పొడి చెత్త మరియు తడి చెత్తను వేర్వేరుగా వర్గీకరించి వేయాలని కమిషనర్ రమణబాబు విద్యార్థులకు అవగాహన కల్పించారు.