ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం చట్టిచర్ల ఎస్సీపాలెం సమీపంలో గురువారం తెల్లవారుజామున కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులో ఉన్న మరో వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.