సర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్

5055చూసినవారు
గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్ రమణబాబు ఆధ్వర్యంలో ఓటర్ల వెరిఫికేషన్ కార్యక్రమం జరిగింది. ఈ నెల 14వ తేదీలోపు ఓటు వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీలో 31 వేలకు పైగా ఓట్లు ఉన్నాయని, సిబ్బంది ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరిస్తారని, ప్రజలు సహకరించాలని కోరారు. గతంలో ఉన్న ఓట్ల పరిశీలన, కొత్త ఓట్ల నమోదు, వివరాల చేరిక వంటి అంశాలపై ఈ కార్యక్రమంలో దృష్టి సారించారు.