బస్సులు ఆపడం లేదని ఎమ్మెల్యేకు ఫిర్యాదు

643చూసినవారు
గిద్దలూరు మండలం పెద్దచెరువు తండా గ్రామస్తులు తమ గ్రామం వద్ద ఆర్టీసీ బస్సులు ఆగడం లేదని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. బుధవారం పెన్షన్ పంపిణీకి వెళ్లినప్పుడు ఎమ్మెల్యే దృష్టికి ఈ సమస్య వచ్చింది. ఎమ్మెల్యే వెంటనే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి, ప్రయాణికులు చేయి ఎత్తితే లేదా దిగేవారు ఉంటే బస్సును పెద్దచెరువు వద్ద ఆపాలని ఆదేశించారు. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్