మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట తాండలో శనివారం రాత్రి సీఐ సురేష్ ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి, అనుమానిత వ్యక్తులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సీఐ అవగాహన కల్పించారు. దొంగతనాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించినట్లు సీఐ తెలిపారు.