వైకుంఠ రథం ఏర్పాటుకు రూ.8 లక్షల విరాళం

6098చూసినవారు
వైకుంఠ రథం ఏర్పాటుకు రూ.8 లక్షల విరాళం
గిద్దలూరు పట్టణంలోని ఆర్యవైశ్య మహాప్రస్థానం (స్మశాన వాటిక) అభివృద్ధిలో భాగంగా మరో ముందడుగు పడింది. మహాప్రస్థానానికి వైకుంఠ రథం (శాంతి రథం) ఏర్పాటు చేసేందుకు విట్టా సుబ్బరత్నం సుమారు రూ. 8 లక్షల వ్యయంతో రథాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. ఆర్యవైశ్య మహాప్రస్థానం అభివృద్ధికి ఇది తొలి అడుగుగా భావిస్తున్నామని ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు తెలిపారు. వైకుంఠ రథం ఏర్పాటుకు ముందుకు వచ్చిన సుబ్బరత్నంకి ఆర్యవైశ్య సంఘం, అన్ని కమిటీల సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారి సేవాభావాన్ని అభినందించారు.

సంబంధిత పోస్ట్