జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ గా డా. పిచ్చయ్య నియామకం

7చూసినవారు
జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ గా డా. పిచ్చయ్య నియామకం
మార్కాపురం జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్షా పరిధిలోని జిల్లా ప్లానింగ్ అండ్ యం. ఐ. ఎస్ కో-ఆర్డినేటర్ గా డాక్టర్ మొర్రి. పిచ్చయ్య నియమితులయ్యారు. ఈ నియామక ఉత్తర్వులను జిల్లా విద్యాశాఖాధికారి సామ సుబ్బారావు శనివారం అందజేశారు. డాక్టర్ మొర్రి. పిచ్చయ్య ప్రస్తుతం గిద్దలూరులోని హై స్కూల్ ప్లస్ లో పిజిటి (తెలుగు)గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ బృందం, సమగ్ర శిక్ష సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్