గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి శనివారం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న లో-వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, దీనివల్ల గృహోపకరణాలు పాడైపోవడంతో పాటు రాత్రి వేళల్లో ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అదనపు లైన్లు, కెపాసిటర్ల ఏర్పాటు, లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరు, సాగునీటి కోసం విద్యుత్ కొరత లేకుండా చూడాలని, మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని ఆదేశించారు.