మార్కాపురం జిల్లా రాచర్ల మండలం ఆకవీడు గ్రామంలో శనివారం పేకాట ఆడుతున్న ఐదుగురిని స్థానిక ఎస్సై కోటేశ్వరరావు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1,250 నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మండలంలో ఎక్కడైనా పేకాట ఆడుతున్నట్లు గుర్తిస్తే వెంటనే 112 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.