గిద్దలూరు మున్సిపాలిటీ ప్రతిష్టాత్మకమైన రాష్ట్రస్థాయి “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ మున్సిపాలిటీ” అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా శుక్రవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ రమణబాబు అవార్డును అందుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య నిర్వహణ, పరిశుభ్రత కార్యక్రమాలు, ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించడం తదితర అంశాల్లో చేపట్టిన చర్యలకు గుర్తింపుగా ఈ రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.