గురువారం మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఏబీఏం పాలెంలో గంగరాజు అనే వ్యక్తి తన భార్య ప్రేమ కుమారిని రోకలిబండతో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన అనంతరం నిందితుడు సంఘటనా స్థలం నుంచి పారిపోయాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.