మార్కాపురం జిల్లా కొమరోలు పట్టణంలో శుక్రవారం శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ దుస్తులు ధరించిన యువతులు, చిన్నారులు ఆడి పాడిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది. శ్రీరాముడి పాటలకు అనుగుణంగా కోలాటం వేస్తూ వారు ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు.