మాజీ మంత్రి రోజాపై జనసేన పార్టీ నాయకులు ఫైర్

328చూసినవారు
ప్రకాశం జిల్లా సంయుక్త కార్యదర్శి బాల రంగయ్య, మాజీ మంత్రి ఆర్కే రోజాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో గురువారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో జనసేన నాయకులు వైసిపి నాయకుల తీరును ఖండించారు. ముఖ్యంగా, రోజా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, జనసేన ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్నారని, ఆయనపై ఇప్పటికే చర్యలు తీసుకున్నారని బాల రంగయ్య తెలిపారు. వైసిపి ప్రభుత్వ హయాంలో మంత్రులు, ఎంపీల వ్యవహార తీరును అందరూ చూశారని, అప్పుడు ఎందుకు స్పందించలేదని రోజాను ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్