ఈనెల 6న మార్కాపురం జిల్లాలో నేతలు పర్యటన

431చూసినవారు
ఈనెల 6న మార్కాపురం జిల్లాలో నేతలు పర్యటన
ఫిబ్రవరి 6వ తేదీన మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షుడు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి, యర్రగొండపాలెం టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. రాచర్ల మండలంలో రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలు శంకుస్థాపనలు చేయనున్నారు. అదేరోజు ఓ బహిరంగ సభ కూడా నిర్వహించబడుతుంది.

సంబంధిత పోస్ట్