మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలంలో, మద్యం తాగి ద్విచక్ర వాహనం నడిపి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతికి కారణమైన మేడం శ్రీనివాసులు అనే వ్యక్తికి సోమవారం గిద్దలూరు కోర్టు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2015లో జరిగిన ఈ ప్రమాదంలో, పోలీసులు కేసు నమోదు చేసి, సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో, న్యాయమూర్తి భరత్ చంద్ర ముద్దాయికి జైలు శిక్షతో పాటు, బాధిత కుటుంబానికి లక్ష రూపాయల నగదు పరిహారంగా అందించాలని ఆదేశించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.