మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని సాయి చైతన్య డిగ్రీ కళాశాల ఆవరణలో ఈనెల 6వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి. రంగస్వామిరెడ్డి బుధవారం తెలిపారు. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలలో ఉద్యోగాల కోసం ఈ మేళా జరుగుతుంది. ఇంటర్, డిగ్రీ కోర్సులు పూర్తి చేసినవారు, ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు తమ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరై ఉద్యోగాలు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు.