మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని
టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సోమవారం మీడియా సమావేశం నిర్వహించి, వైసిపి నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి నాయకులకు అబద్ధాలు ఆడటం పరిపాటిగా మారిందని, అందుకే పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో ఓడించారని అన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదా అని ఎమ్మెల్యే
వైసీపీ నాయకులను ప్రశ్నించారు.