అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

307చూసినవారు
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి శంకుస్థాపన చేశారు. బస్టాండ్ అభివృద్ధికి కోటి రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గతంలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ ఎండీ తిరుమల రావును కలిసి విజ్ఞప్తి చేయడంతో అభివృద్ధికి నిధులు కేటాయించబడ్డాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో బస్టాండ్ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్