రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆహ్వానం

1206చూసినవారు
రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆహ్వానం
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం జల్లి పుల్లలచెరువు గ్రామంలోని స్వయంభూ శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆహ్వానం పలికారు. ఈ ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభమై 2, 3, 4, 5 తేదీలలో కళ్యాణ మహోత్సవం, తెప్పోత్సవం, చక్రస్నానం వంటి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరూ భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు పొందాలని ఎమ్మెల్యే కోరారు.

సంబంధిత పోస్ట్