గిద్దలూరులో మోస్తరు వర్షం

7286చూసినవారు
మార్కాపురం జిల్లా గిద్దలూరులో వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పగటిపూట ఎండ తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, రాత్రివేళ మేఘావృత వాతావరణంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాతావరణ మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంగళవారం సూచించారు.

సంబంధిత పోస్ట్