మంగళవారం నిర్వహించిన గిద్దలూరు మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నికల లెక్కింపులో ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేసిన
బీజేపీ అభ్యర్థి డాక్టర్ జాడి వెంకటనారాయణ విజయం సాధించారు. ఈ ఫలితం వెలువడగానే కూటమికి చెందిన
టీడీపీ,
జనసేన,
బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేయడంతో గిద్దలూరులో పండుగ వాతావరణం నెలకొంది. ఈ విజయం కూటమి శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.