మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణం రాచర్ల మండలం జల్లి వారి పుల్లలచెరువు గ్రామంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు రేపటి నుండి అంగరంగ వైభవంగా ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తూ రవాణా సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అలాగే భద్రత పరంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.