గిద్దలూరులో లైన్ మెయింటినెన్స్, చెట్ల కొమ్మల తొలగింపు పనుల నిమిత్తం ఈనెల 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ముండ్లపాడు సబ్స్టేషన్ ఏఈ ఒక ప్రకటనలో తెలిపారు. సంజీవరాయునిపేట సబ్ స్టేషన్ పరిధిలోని సంజీవరాయునిపేట, దంతెరపల్లి, దేవనగరం, గడికోట, కంచిపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురం ఫీడర్, గుండ్లమోటు ఫీడర్, వెంకటాపురం, బయనపల్లి ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని, ప్రజలు గమనించాలని సూచించారు.