మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఫిబ్రవరి 2వ తేదీ సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు తెలిపారు. నూతన విద్యుత్ లైను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో తాటిచెర్ల మోటు విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలోని గుండ్రెడ్డిపల్లి గ్రామానికి ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.