ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఆదివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు తెలిపారు. పొట్టిపల్లె, అక్కపల్లె, కంకరవానిపల్లె, గోవింద పల్లె గ్రామాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు, విద్యుత్ సిబ్బందికి సహకరించాలని కోరారు.