రేపు కొమరోలు మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

161చూసినవారు
రేపు కొమరోలు మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. నూతన విద్యుత్ లైన్ల నిర్మాణం కారణంగా తాటిచెర్ల మోటు సబ్ స్టేషన్ పరిధిలోని దద్దవాడ, నాగిరెడ్డిపల్లి, అలసందలపల్లి, నారాయణ పల్లి, గుండ్రెడ్డిపల్లి, వెంకటంపల్లి, తాటిచెర్ల, హసనాపురం, ముత్రాసుపల్లి, పొట్టుపల్లి, అక్కపల్లె, గోవిందల పల్లె, కంకరవాని పల్లి గ్రామాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఏఈ శ్రీనివాసులు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్