శనివారం గిద్దలూరు మండలం వెంకటాపురంలో ఉద్యానశాఖ అధికారి శ్వేత మాట్లాడుతూ, రైతులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే సాగులో పెట్టుబడి తగ్గి లాభాలు వస్తాయని తెలిపారు. డిప్, స్ప్రింకర్ సాగు పద్ధతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులకు బిందు సేద్యం ఆటోమేషన్ పద్ధతిపై అవగాహన కల్పించారు. ఆటోమేషన్ యూనిట్ ద్వారా రైతులు తమ చరవాణి ద్వారానే రిమోట్ కంట్రోల్తో పొలంలో వాల్వులను నియంత్రించవచ్చని వివరించారు.