మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో శ్రీరామనవమి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించగా, ఈరోజు సాయంత్రం రాములవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ ఊరేగింపులో కేరళ డ్రమ్స్ బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని “జై శ్రీరాం” నినాదాలతో పట్టణాన్ని మార్మోగిస్తున్నారు. సాంప్రదాయ కోలాట కార్యక్రమం కూడా ఉత్సవాలకు మరింత శోభ చేకూర్చింది.