గిద్దలూరు వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. బుధవారం గిద్దలూరు మండలంలో విస్తృతంగా పర్యటించి, కార్యకర్తలతో సమావేశమయ్యారు. గ్రామస్థాయి కమిటీల సభ్యులను నియమించి, స్థానిక ఎన్నికలలో పార్టీ సత్తా చాటేలా పనిచేయాలని సూచించారు. మరోసారి జగనన్న సీఎం అవుతారని ఆయన జోస్యం చెప్పారు.