గిద్దలూరు పట్టణంలో ఆదివారం ఉదయం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే పార్టీ జెండాను ఆవిష్కరించి, అన్న ఎన్టీఆర్ ఘనంగా నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం అని, సీఎం చంద్రబాబు నాయుడు దార్శనికత, నారా లోకేష్ చొరవతో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందని ఆయన అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రతి కార్యకర్త గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి, రాబోయే విజయాలకు శ్రమించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.