ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి..ఎంఈవో

798చూసినవారు
కంభం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు సిఆర్పీలు, ఎంఈఓ కార్యాలయ సిబ్బంది కృషి చేయాలని ఎంఈవోలు అబ్దుల్ సత్తార్, శ్రీనివాసులు గురువారం సూచించారు. రానున్న విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, పాఠశాలల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు లక్ష్యంగా చేసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో డ్రాప్‌అవుట్ విద్యార్థులను గుర్తించి, తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని తెలిపారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.

సంబంధిత పోస్ట్