తిరుమల వెంకన్నకు కోపం వచ్చింది అందుకే 11 సీట్లు

149చూసినవారు
తిరుమల లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేయడం వల్లే వైసిపి తిరుమల వెంకన్న కోపానికి గురైందని ప్రకాశం జిల్లా బీజేపీ సంయుక్త కార్యదర్శి జేవి నారాయణ ఆరోపించారు. గురువారం గిద్దలూరులో బీజేపీ నాయకులు పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశంలోని ప్రముఖ ల్యాబ్‌లు లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందని చెబుతున్నా వైసిపి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. 2019లో 151 సీట్లు గెలిచిన వైసిపి, తిరుమల వెంకన్న కోపంతో 11 సీట్లకు పడిపోయిందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్